శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప పీఠం దగ్గర పూజ విధానం:
విన్నంపం : నా పేరు నరేంద్ర (స్మైలీ స్వామి) అంటారు , నేను తెలుసుకున్న మరియు మాలధారణ లో రోజు నేను పాటిస్తున్న పూజ విధానం వివరిస్తున్నాను. స్వాములందరు ఏదైనా తప్పుగా అనిపిస్తే నన్ను మన్నించి, తప్పులను నాకు తెలియచేయండి.
గమనిక 1: పూజ లో తడి వస్త్రాల (బట్టల) తో కూర్చోకూడదు.
గమనిక 2: వంటి మీద అంగ వస్త్రం లేకుండా & ఏక వస్త్రం తో కూర్చోకూడదు.
==> ఆచమనం
==> సంకల్పం
==> శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం.
==> గణపతి అధాంగ పూజ / Ganapathi adhaanga puja
==> గణపతి అష్టోస్తార శత నామావళి
==> సుబ్రమణేశ్వర స్వామి అధాంగ పూజ
==> సుబ్రమణేశ్వర స్వామి అష్టోస్తార శత నామావళి
==> అయ్యప్ప స్వామి అధాంగ పూజ
==> అయ్యప్ప స్వామి అష్టోస్తార శత నామావళి
==> అయ్యప్ప స్వామి శరణు ఘోష
==> అయ్యప్ప కర్పూర హారతి
==> అయ్యప్ప శాస్తాస్తుతి (ఆది శంకర ప్రణీతము )
==> క్షమాపణ మంత్రం
==> ఆత్మ ప్రదక్షిణము మంత్రం
==> సాష్టాంగ నమస్కారం మంత్రం
==> తీర్ధం మంత్రం
=========================================================
ఆచమనం
Note: ఏదైనా ఒక పవిత్రమైన పనిచేస్తున్నప్పుడు ఆచమనం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఓం కేశవాయ స్వాహాః --> కేసి అనే రాక్షసుని చంపిన దైవానికి నమస్కారం
ఓం నారాయణాయ స్వాహాః --> చుట్టూ నీటి మధ్యలో ఉన్న దైవానికి నమస్కారం
ఓం మాధవాయ స్వాహాః --> మాధవి (లక్ష్మీదేవి) భర్తకు నమస్కారం
ఓం గోవిందాయ నమః --> గోవులను రక్షించు దైవానికి నమస్కారం
ఆచమనము : కుడి అరచేతిని ఆవు చెవి ఆకారంలో ఉంచి, ఇందులో 5 సార్లు ఉద్ధరణి తో నీటిని పోసుకుంటూ..
మొదటి సారి ఉద్దరిని తో చేతి లో నీరు పోసుకున్నప్పుడు ఓం హస్త ప్రక్షాళనం అనుకుంటూ చెయ్యి నీ కడగాలి
రెండవ సారి ఉద్దరిని తో చేతి లో నీరు పోసుకున్నప్పుడు “కేశవాయ స్వాహా" అంటూ చేతి లో నీటిని, నోటితో స్వీకరించాలి
మూడవ సారి ఉద్దరిని తో చేతి లో నీరు పోసుకున్నప్పుడు “నారాయణాయ స్వాహా" అంటూ చేతి లో నీటిని, నోటితో స్వీకరించాలి
నాల్గవ సారి ఉద్దరిని తో చేతి లో నీరు పోసుకున్నప్పుడు “మాధవాయ స్వాహా" అంటూ చేతి లో నీటిని, నోటితో స్వీకరించాలి
ఐదవ సారి ఉద్దరిని తో చేతి లో నీరు పోసుకున్నప్పుడు ఓం హస్త ప్రక్షాళనం అనుకుంటూ చెయ్యి ను కడగాలి
ఆచమనము ఎందుకు చెయ్యాలి? : “కేశవాయ స్వాహా" అన్నప్పుడు అది గొంతునుండి వెలువడుతుంది. “నారాయణాయ స్వాహా" అనే మంత్రం నాలుక సాయంతో బయటకు వస్తుంది. చివరిగా "మాధవాయ స్వాహా" అనే మంత్రం పెదవుల సాయంతో వెలువడుతుంది. ఆచమనం అనే ఆచారాన్ని పాటించి ఈ మంత్రాలను ఉచ్చరించడం వల్ల గొంతు, నాలుక, పెదాలకు వ్యాయామం లభిస్తుంది. పైగా ఇవి పరమాత్ముని నామాలు కనుక, భక్తిభావంతో ఉచ్చరించడం వల్ల మేలు జరుగుతుంది.
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే
అర్థం: (గణేశ భగవానునికి నమస్కారములు) తెల్లని వస్త్రము ధరించి, సమస్తమూ వ్యాపించి ఉండి, చంద్రుని వలే తెల్లని వర్ణముతో వెలుగొందుచూ, నాలుగు భుజములతో, ప్రసన్నమైన ముఖము కలిగి ఉన్న విఘ్నేశ్వరా, నేను నిన్ను ధ్యానించుచున్నాను, నా జీవన మార్గము నందు ఉన్న సర్వ విఘ్నములనూ తీసివేయుము.
తొండము నేకదంతము తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయుగజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీ తనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిద్బవతుమే సదా.
పద్మపత్ర విశాలాక్షీ పద్మ కేసరవర్ణినీ
నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ..
తల్లీ! నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్
నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా
నుక్తుల్ సుశబ్దంబులు శోభిల్లం బల్కుము నాదు వాక్కునను
సంప్రీతిన్ జగన్మోహినీ ఫుల్లాబ్జాక్షీ! సరస్వతీ! భగవతీ! పూర్ణేందుబింబాననా!!
గణపతి అధాంగ పూజ (నఖశిఖ పర్యంతం)/ Ganapathi adhaanga puja
ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి ---> పాదముల కు
ఓం ఏకదంతాయ నమః గుల్భౌ పూజయామి --> మడమలు
ఓం శూర్పకర్ణాయ నమః జానునీ పూజయామి ---> మోకాళ్ళు
ఓం విగ్నరాజాయ నమః జంఘే పూజయామి --> పిక్కలు
ఓం ఆఖువాహనయ నమః ఊరు పూజయామి ---> తొడలు
ఓం హేరంభాయ నమః కటిం పూజయామి ---> నడుము
ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి ---> బొజ్జ
ఓం గణనాధాయ నమ: నాభిం పూజయామి ---> బొడ్డు
ఓం గణనాయకాయ నమః హృదయం పూజయామి ---> రొమ్ము
ఓం స్తూలకంటయ నమః కంఠం పూజయామి --> కంఠం
ఓం స్కంధగ్రజయ నమః స్కందౌ పూజయామి ---> భుజములు
ఓం పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి ---> చేతులు
ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి ---> ముఖము
ఓం విఘ్న హంత్రేయనమ: నేత్రే పూజయామి ---> కన్నులు
ఓం శుర్పకర్నయ నమః కర్ణౌ పూజయామి ---> చెవులు
ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి ---> నుదురు
ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి ---> తల
ఓం గణాధిపాయ నమః సర్వాణ్యంగాని పూజయామి
గణపతి అధాంగ పూజాం సమర్పయామి
గణపతి అష్టోస్తార శత నామావళి
Note: ప్రతి మంత్రం తరువాత "ఓం గణేశాయనమః " అనాలి
ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నారాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్త్వెమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీపాయ నమః (10)
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజఠరాయ నమః
ఓం హ్రస్వగ్రీవాయ నమః (20)
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళ స్వరాయ నమః
ఓం ప్రమధాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః (30)
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రిత వత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బలాయ నమః (40)
ఓం బలోత్థితాయ నమః
ఓం భవాత్మజాయ నమః
ఓం పురాణ పురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్షిప్త వారిణే నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః (50)
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వ కర్త్రే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం సర్వసిధ్ధి ప్రదాయ నమః
ఓం సర్వ సిద్ధయే నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః (60)
ఓం అక్షోభ్యాయ నమః
ఓం కుంజరాసుర భంజనాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థవనప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః (70)
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం జిష్ణవే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్త జీవితాయ నమః
ఓం జిత మన్మథాయ నమః
ఓం ఐశ్వర్య కారణాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షకిన్నెర సేవితాయ నమః
ఓం గంగా సుతాయ నమః
ఓం గణాధీశాయ నమః (80)
ఓం గంభీర నినదాయ నమః
ఓం వటవే నమః
ఓం అభీష్ట వరదాయినే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం భక్త నిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం మంగళ ప్రదాయ నమః
ఓం అవ్వక్తాయ నమః
ఓం అప్రాకృత పరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః (90)
ఓం సఖయే నమః
ఓం సరసాంబు నిధయే నమః
ఓం మహేశాయ నమః
ఓం దివ్యాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖాలాయ నమః
ఓం సమస్తదేవతా మూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విఘాత కారిణే నమః
ఓం విశ్వగ్దృశే నమః (100)
ఓం విశ్వరక్షాకృతే నమః
ఓం కళ్యాణ గురవే నమః
ఓం ఉన్మత్త వేషాయ నమః
ఓం అపరాజితే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్త్వెశ్వర్యప్రదాయ నమః
ఓం ఆక్రాంత చిదచిత్ప్రభవే నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః (108)
గణపతి కి 2 సాంబ్రాణి పుల్లలు వెలిగించి, ధూపము సమర్పయామి అని చెప్తూ గణపతి కి ధూపము సమర్పించాలి.
గణపతి ముందు నైవేద్యం (ఒక పండు కానీ, తాంబూలం (తమలపాకు +2 అరటి పండ్లు+ వక్క) కానీ, అటుకులు+బెల్లం కానీ పెట్టి, దీప ధూప అనంతరం నైవేద్యం సమర్పయామి అని చెప్తూ చేతితో స్వామి వారి వైపు చూపించి నమస్కారం చేసుకోవాలి
లేదా ఈ క్రింద తెలిపిన విధంగా కూడా మంత్రాలతో నైవేద్యం సమర్పించ వచ్చు
ఓం నైవేద్యం సమర్పయామి
ఓం ప్రాణాయ స్వాహా
ఓం అపానాయ స్వాహా
ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా
ఓం సమానాయ స్వాహా
ఓం బ్రహ్మణే స్వాహా
మధ్య మధ్య పానీయం సమర్పయామి
హస్త ప్రక్షాళన సమర్పయామి
పాద ప్రక్షాళన సమర్పయామి
శుద్ధ ఆచమనీయం సమర్పయామి
సుబ్రమణేశ్వర స్వామి అధాంగ పూజ
అమరస్తుత పాదయుగళాయ నమః - పాదం పూజయామి
ద్విషద్భాహవే నమః - బాహూన్ పూజయామి
ద్విషణ్ణేత్రాయ నమః - నేత్రం పూజయామి
ద్విషణ్ముభాయ నమః - ముఖం పూజయామి
ద్విషట్టర్ణాయ నమః - కర్ణౌ పూజయామి
గుహ్యా య నమః - గుహ్యం పూజయామి..
సునాసాయ నమః - నాసికామ్ పూజయామి
జ్ఞానశక్తి కరాయనమః - హస్తాన్ పూజయామి
కాఠిన్యస్త పాణయేనమః - కటిం పూజయామి
లంభోదరానుజాయ నమః - ఉదరం పూజయామి
సువిశాల వక్షస్రే నమః - వక్షస్థలంపూజయామి
శితికంఠసుతాయనమః - కంఠం పూజయామి
సర్వసేనాపతయేనమః - సర్వాణ్యంగాని పూజయామి
శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః
అథాంగపూజాం సమర్పయామి
సుబ్రమణేశ్వర స్వామి అష్టోస్తార శత నామావళి
Note: ప్రతి మంత్రం తరువాత "ఓం షణ్ముఖాయ నమః " అనాలి
ఓం స్కంధాయ నమః
ఓం గుహాయ నమః
ఓం షణ్ముఖాయ నమః
ఓం ఫాలనేత్రసుతాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం పింగళాయ నమః
ఓం కృత్తికాసూనవే నమః
ఓం శిఖివాహాయ నమః
ఓం ద్విషడ్భుజాయ నమః
ఓం ద్విషణ్ణేత్రాయ నమః --> 10
ఓం శక్తిధరాయ నమః
ఓం ఫిశితాశప్రభంజనాయ నమః
ఓం తారకాసురసంహార్త్రే నమః
ఓం రక్షోబలవిమర్దనాయ నమః
ఓం మత్తాయ నమః
ఓం ప్రమత్తాయ నమః
ఓం ఉన్మత్తాయ నమః
ఓం సురసైన్యస్సురక్షకాయ నమః
ఓం దేవసేనాపతయే నమః
ఓం ప్రాఙ్ఞాయ నమః --> 20
ఓం కృపాళవే నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం ఉమాసుతాయ నమః
ఓం శక్తిధరాయ నమః
ఓం కుమారాయ నమః
ఓం క్రౌంచదారణాయ నమః
ఓం సేనానియే నమః
ఓం అగ్నిజన్మనే నమః
ఓం విశాఖాయ నమః
ఓం శంకరాత్మజాయ నమః --> 30
ఓం శివస్వామినే నమః
ఓం గుణస్వామినే నమః
ఓం సర్వస్వామినే నమః
ఓం సనాతనాయ నమః
ఓం అనంతశక్తియే నమః
ఓం అక్షోభ్యాయ నమః
ఓం పార్వతి ప్రియనందనాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం శరోద్భూతాయ నమః
ఓం ఆహూతాయ నమః --> 40
ఓం పావకాత్మజాయ నమః
ఓం జృంభాయ నమః
ఓం ప్రజృంభాయ నమః
ఓం ఉజ్జృంభాయ నమః
ఓం కమలాసనసంస్తుతాయ నమః
ఓం ఏకవర్ణాయ నమః
ఓం ద్వివర్ణాయ నమః
ఓం త్రివర్ణాయ నమః
ఓం చతుర్వర్ణాయ నమః
ఓం పంచవర్ణాయ నమః --> 50
ఓం సుమనోహరాయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం అహర్పతయే నమః
ఓం అగ్నిగర్భాయ నమః
ఓం శమీగర్భాయ నమః
ఓం విశ్వరేతసే నమః
ఓం సురారిఘ్నే నమః
ఓం హరిద్వర్ణాయ నమః
ఓం శుభకారాయ నమః
ఓం వటవే నమః --> 60
ఓం వటవేషభృతే నమః
ఓం పూషాయ నమః
ఓం గభస్తియే నమః
ఓం గహనాయ నమః
ఓం చంద్రవర్ణాయ నమః
ఓం కళాధరాయ నమః
ఓం మాయాధరాయ నమః
ఓం మహామాయినే నమః
ఓం కైవల్యాయ నమః
ఓం శంకరాత్మజాయ నమః --> 70
ఓం విశ్వయోనియే నమః
ఓం అమేయాత్మా నమః
ఓం తేజోనిధయే నమః
ఓం అనామయాయ నమః
ఓం పరమేష్టినే నమః
ఓం పరబ్రహ్మయ నమః
ఓం వేదగర్భాయ నమః
ఓం విరాట్సుతాయ నమః
ఓం పుళిందకన్యాభర్తాయ నమః
ఓం మహాసారస్వతావృతాయ నమః --> 80
ఓం ఆశ్రితాఖిలదాత్రే నమః
ఓం చోరఘ్నాయ నమః
ఓం రోగనాశనాయ నమః
ఓం అనంతమూర్తయే నమః
ఓం ఆనందాయ నమః
ఓం శిఖిండికృతకేతనాయ నమః
ఓం డంభాయ నమః
ఓం పరమడంభాయ నమః
ఓం మహాడంభాయ నమః
ఓం వృషాంకపయే నమః --> 90
ఓం కారణోపాత్తదేహాయ నమః
ఓం కారణాతీతవిగ్రహాయ నమః
ఓం అనీశ్వరాయ నమః
ఓం అమృతాయ నమః
ఓం ప్రాణాయ నమః
ఓం ప్రాణాయామపరాయణాయ నమః
ఓం విరుద్దహంత్రే నమః
ఓం వీరఘ్నాయ నమః
ఓం రక్తాస్యాయ నమః
ఓం శ్యామకంధరాయ నమః -->100
ఓం సుబ్రహ్మణ్యాయ నమః
ఓం గుహాయ నమః
ఓం ప్రీతాయ నమః
ఓం బ్రాహ్మణ్యాయ నమః
ఓం బ్రాహ్మణప్రియాయ నమః
ఓం వంశ వృద్ధి కరాయ నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం అక్షయఫలదాయ నమః -->108
ఓం వల్లీదేవసేనాసమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే నమః
ఇతి శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరశతనామావళి సంపూర్ణం
సుబ్రహ్మణ్య స్వామి కి 2 సాంబ్రాణి పుల్లలు వెలిగించి, ధూపము సమర్పయామి అని చెప్తూ సుబ్రహ్మణ్య స్వామి కి ధూపము సమర్పించాలి.
సుబ్రహ్మణ్య స్వామి ముందు నైవేద్యం (ఒక పండు కానీ, తాంబూలం (తమలపాకు +2 అరటి పండ్లు+ వక్క) కానీ, అటుకులు+బెల్లం కానీ పెట్టి, దీప ధూప అనంతరం నైవేద్యం సమర్పయామి అని చెప్తూ చేతితో స్వామి వారి వైపు చూపించాలి.
అయ్యప్ప స్వామి అధాంగ పూజ
పంపాలాయై నమః --->పాదం పూజయామి
గహ్యతి గుహ్యగోస్తే నమః ---> గుల్ఫౌ పూజయామి
అంకుశధరాయ నమః ---> జాంఘే పూజయామి
జగన్మోహనాయ నమః ---> జానునీ పూజయామి
ఉద్దామవైభాయ నమః ---> ఊరూ పూజయామి
ఖండేందు కేళి తనయాయ నమః ---> కటిం పూజయామి
హరి హర పుత్రాయ సమః --> గుహ్యం పూజయామి
దక్షిణామూర్తి రూపాయ నమః ---> నాభీం పూజయామి
వరదాన కీర్తయే నమః ---> ఉదరం పూజయామి
త్రిలోక రక్షకాయ నమః ---> వక్షస్తము పూజయామి
మణి పూర్ణాబ్జా నిలయాయనమః ---> పార్శావ్ పూజయామి
పాశహస్తాయ నమః ---> పాస్తాన్ పూజయామి
మంత్రరూపాయ నమః ---> హృదయం పూజయామి
వజ్రమాలాధరాయ నమః ---> కంఠం పూజయామి
సూర్యకోటి సమప్రభాయ నమః ---> ముఖం పూజయామి
గ్రామపాలకాయ నమః ---> గళం పూజయామి
తీక్షదంతాయ నమః ---> దంతాన్ పూజయామి
కారుణ్యామృత లోచనాయ నమః ---> నేత్రాణి పూజయామి
రత్నకుండల ధారిణే నమః ---> కర్నౌ పూజయామి
లాస్య ప్రియాయ నమః ---> లలాటంపూజయామి
శ్రీ శివ ప్రదాయ నమః ---> శిరః పూజయామి
-జటామకుట ధారిణే నమః ---> అలకాన్ పూజయామి
శ్రీ హరిహరపుత్ర స్వరూప ధర్మశాస్త్ర నమః ---> సర్వాణ్యంగాని పూజయామి
అయ్యప్ప స్వామి అష్టోస్తార శత నామావళి
Note: ప్రతి మంత్రం తరువాత "ఓం మణి కంఠాయనమః " అనాలి
1. ఓం శ్రీ మహా శా(స్తే నమః
2. ఓం విశ్వ శా(స్తే నమః
3. ఓం లోక శా(స్తే నమః
4. ఓం మహాబలాయ నమః
5. ఓం ధర్మ శా(స్తే నమః
6. ఓం వేద శా(స్తే నమః
7. ఓం కాల శా(స్తే నమః
8. ఓం మహాజసే నమః
9. ఓం గజాధిపాయ నమః
10. ఓం అంగపతయే నమః
11. ఓం వ్యాఘపతయే నమః
12. ఓం మహాద్యుతాయ నమః
13. ఓం గణాధ్యక్షాయ నమః
14. ఓ౦ అగ్ర గణ్యాయ నమః
15. ఓం మహా గుణ గణాలయ నమః
16. ఓం బుగ్వేద రూపాయ నమః
17. ఓం నక్ష్మత్రాయ నమః
18. ఓం చంద్ర రూపాయ నమః
19. ఓం వలాహకాయ నమః
20. ఓం దూర్వాయ నమః
21. ఓం శ్యామాయ నమః
22. ఓం మహా రూపాయ నమః
23. ఓం క్రూర దృష్టయే నమః
24. ఓం అనామయాయ నమః
25. ఓం త్రినేతాయ నమః
26. ఓం ఉత్సాలాకారాయ నమః
27. ఓం కాలాంతకాయ నమః
28. ఓం నరాధిపాయ నమః
29. ఓం దక్షమూషకాయ నమః
30. ఓం కల్హార కుసుమ ప్రియాయ నమః
31. ఓం మదనాయ నమః
32. ఓ౦ మాధవ సుతాయ నమః
33. ఓం మందార కుసుమ ప్రియాయ నమః
34. ఓం మదాల సాయ నమః
35. ఓం వీర శా(స్తే నమః
36. ఓ౦ మహా సర్ప విభూషితాయ నమః
37. ఓం మహా సూరాయ నమః
38. ఓం మహా ధీరాయ నమః
39. ఓం మహా పాప వినాశకాయ నమః
40. ఓం కపి హస్తాయ నమః
41. ఓం శరదరాయ నమః
42. ఓం హలా హలాధరసుతాయ నమః
43. ఓం అగ్ని నయనాయ నమః
44. ఓ౦ అర్హున పతయే నమః
45. ఓం అనంగ మదనాతురాయ నమః
46. ఓం దుష్ట గ్రహాధిపాయ నమః
47. ఓం శా(స్తే నమః
48. ఓం శిష్ట రక్షణ ధీక్షితాయ నమః
49. ఓం రాజ రాజర్చితాయ నమః
50. ఓం రాజ శేఖరాయ నమః
51. ఓం రాజోత్తమాయ నమః
52. ఓం మంజులేశాయ నమః
53. ఓం వర రుచయే నమః
54. ఓం వరదాయ నమః
55. ఓం వాయు వాహనాయ నమః
56. ఓం వజ్రాంగాయ నమః
57. ఓం విష్ణు పుత్రాయ నమః
58. ఓం ఖఢ ప్రాణయే నమః
59. ఓం బలో ధ్యుతాయ నమః
60. ఓం త్రిలోక జ్జానాయ నమః
61. ఓం అతిబలాయ నమః
62. ఓం కస్తూరి తిలకాంచితాయ నమః
63. ఓం పుష్కలాయ నమః
64. ఓం పూర్ణ ధవళాయ నమః
65. ఓం పూర్ణ లేశాయ నమః
66. ఓం కృపాలయాయ నమః
67. ఓం వనజనాధి పాయ నమః
68. ఓం పాశహస్తాయ నమః
69. ఓం భయాపహాయ నమః
70. ఓం బకారరూపాయ నమః
71. ఓం పాపఘ్నాయ నమః
72. ఓం పాషండ రుధిశాయ నమః
73. ఓం పంచ పాండవ సంరక్షకాయ నమః
74. ఓం పరపాప వినాశకాయ నమః
75. ఓం పంచవ(క్త కుమారాయ నమః
76. ఓం పంచాక్షక పారాయణాయ నమః
77. ఓం పండితాయ నమః
78. ఓం శ్రీ ధరసుతాయ నమః
79. ఓం న్యాయాయ నమః
80. ఓం కవచినే నమః
81. ఓం కరీణామదిపాయ నమః
82. ఓం కాండయుజుషే నమః
83. ఓం తర్పణ ప్రియాయ నమః
84. ఓం సోమరూపాయ నమః
85. ఓం వన్యధన్యాయ నమః
86. ఓం సత్పందాపాప వినాశకాయ నమః
87. ఓం వ్యాగ్ర చర్మధరాయ నమః
88. ఓం శూలినే నమః
89. ఓం కృపాళాయ నమః
90. ఓం వేణు వదనాయ నమః
91. ఓం కంచు కంఠాయ నమః
92. ఓం కళరవాయ నమః
93. ఓం కిరీటాధి విభూషితాయ నమః
94. ఓం దూర్చటినే నమః
95. ఓం వీరనిలయాయ నమః
96. ఓం వీరాయ నమః
97. ఓం వీరేంద్రవందితాయ నమః
98. ఓం విశ్వ రూపాయ నమః
99. ఓం వీరపతయే నమః
100. ఓం వివిధార్ధ ఫల ప్రదాయ నమః
101. ఓం మహారూపాయ నమః
102. ఓం చతుర్భాహవే నమః
103. ఓం పరపాప విమోచకాయ నమః
104. ఓం నాగ కుండలధరాయ నమః
105. ఓం కిరీటాయ నమః
106. ఓం జటాధరాయ నమః
107. ఓం నాగాలంకార సంయుక్తాయ నమః
108. ఓం నానారత్నవిభూషితాయ నమః
ఇతి శ్రీ స్వామి అయ్యప్ప అఫ్తోత్తర శతనామావళి సంపూర్ణం
అయ్యప్ప స్వామికి 2 సాంబ్రాణి పుల్లలు వెలిగించి, ధూపము సమర్పయామి అని చెప్తూ అయ్యప్ప స్వామి కి ధూపము సమర్పించాలి.
అయ్యప్ప స్వామి ముందు నైవేద్యం (ఒక పండు కానీ, తాంబూలం (తమలపాకు +2 అరటి పండ్లు+ వక్క) కానీ, అటుకులు+బెల్లం కానీ పెట్టి, దీప ధూప అనంతరం నైవేద్యం సమర్పయామి అని చెప్తూ చేతితో స్వామి వారి వైపు చూపించాలి.
ప్రతిరోజూ కాకపోయినా బుధవారం నాడు మరియు శనివారం నాడు మహా నైవేద్యం (ఇంట్లో వండినవి ( పులిహోర లేదా పాయసం లేదా చక్రపొంగలి లేదా పర్వాన్నం ) సమర్పించుకుంటే మంచిది.
మహా నైవేద్యం పూజ చివరిలో సమర్పించాలి. తరువాత ఉంటే కొబ్బరి కాయ కొట్టాలి.
అయ్యప్ప స్వామి శరణు ఘోష
ఓం శ్రీ స్వామియే --> శరణం అయ్యప్ప
ఓం అయ్యప్ప దైవమే --> శరణం అయ్యప్ప
ఓం అఖిల లోక నాయకనే --> శరణం అయ్యప్ప
ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే --> శరణం అయ్యప్ప
ఓం అన్నదాన ప్రభువే --> శరణం అయ్యప్ప
ఓం అర్చన్ కోవిల్ అరసే --> శరణం అయ్యప్ప
ఓం ఆదిమూల మహా గణపతి భగవనే --> శరణం అయ్యప్ప
ఓం నవ రత్నకిరీటి ధారినే --> శరణం అయ్యప్ప
ఓం ఈశ్వర తనయనే --> శరణం అయ్యప్ప
ఓం ఢమరుక ప్రియ సుతనే --> శరణం అయ్యప్ప
ఓం ఉమా సుతనే --> శరణం అయ్యప్ప
ఓం నారాయణ సుతనే --> శరణం అయ్యప్ప
ఓం మోహిని సుతనే --> శరణం అయ్యప్ప
ఓం పందళ రాజ కుమారనే --> శరణం అయ్యప్ప
ఓం శక్తి దేవ కుమారనే --> శరణం అయ్యప్ప
ఓం ఉత్తర నక్షత్ర జాతకనే --> శరణం అయ్యప్ప
ఓం గణపతి సోదరనే --> శరణం అయ్యప్ప
ఓం షణ్ముఖ సోదరనే --> శరణం అయ్యప్ప
ఓం పద్దెనిమిది సోపానాదిపతయే --> శరణం అయ్యప్ప
ఓం అలంకార ప్రియనే --> శరణం అయ్యప్ప
ఓం మాలధారణ ప్రియనే --> శరణం అయ్యప్ప
ఓం విల్లాలి వీరనే --> శరణం అయ్యప్ప
ఓం వీర మణికంఠనే --> శరణం అయ్యప్ప
ఓం గంధాభిషేక ప్రియనే --> శరణం అయ్యప్ప
ఓం కుంకుమభిషేక ప్రియనే --> శరణం అయ్యప్ప
ఓం భస్మాభిషేక ప్రియనే --> శరణం అయ్యప్ప
ఓం పన్నీరాభిషేక ప్రియనే --> శరణం అయ్యప్ప
ఓం పాలాభిషేక ప్రియనే --> శరణం అయ్యప్ప
ఓం పెరుగాభిషేక ప్రియనే --> శరణం అయ్యప్ప
ఓం నెయ్యభిషేక ప్రియనే --> శరణం అయ్యప్ప
ఓం చక్కెరాభిషేక ప్రియనే --> శరణం అయ్యప్ప
ఓం తెనాభిషేక ప్రియనే --> శరణం అయ్యప్ప
ఓం ఫలుదాభిషేక ప్రియనే --> శరణం అయ్యప్ప
ఓం పంచామృతాభిషేక ప్రియనే --> శరణం అయ్యప్ప
ఓం టెంకాయ నీరాభిషేక ప్రియనే --> శరణం అయ్యప్ప
ఓం ఔన్నత్య ప్రియనే --> శరణం అయ్యప్ప
ఓం కర్పూర పరిమళ శోభిత ప్రియనే --> శరణం అయ్యప్ప
ఓం మకర జ్యోతి స్వరూపనే --> శరణం అయ్యప్ప
ఓం ఇందిర రమణ ప్రియనే --> శరణం అయ్యప్ప
ఓం ఘంటా నాధ ప్రియనే --> శరణం అయ్యప్ప
ఓం ఢంకా నాద ప్రియనే --> శరణం అయ్యప్ప
ఓం త్రిమూర్తి ప్రియనే --> శరణం అయ్యప్ప
ఓం ఇరుముడి ప్రియనే --> శరణం అయ్యప్ప
ఓం యజ్ఞ ప్రియనే --> శరణం అయ్యప్ప
ఓం లంభోదర ప్రియనే --> శరణం అయ్యప్ప
ఓం లక్ష్మి వల్లభ ప్రియనే --> శరణం అయ్యప్ప
ఓం శరణు ఘోష ప్రియనే --> శరణం అయ్యప్ప
ఓం మురళి లోలగాన ప్రియనే --> శరణం అయ్యప్ప
ఓం ఓంకార మూర్తియే --> శరణం అయ్యప్ప
ఓం ఔదార్య మూర్తియే --> శరణం అయ్యప్ప
ఓం కరుణా మూర్తియే --> శరణం అయ్యప్ప
ఓం యోగ మూర్తియే --> శరణం అయ్యప్ప
ఓం రక్షణ మూర్తియే --> శరణం అయ్యప్ప
ఓం పుణ్య మూర్తియే --> శరణం అయ్యప్ప
ఓం శతృ సంహర మూర్తియే --> శరణం అయ్యప్ప
ఓం ఐశ్వర్య మూర్తియే --> శరణం అయ్యప్ప
ఓం సకలరోగ నివారణ ధన్వంతర మూర్తియే--> శరణం అయ్యప్ప
ఓం ఏకాంత మూర్తియే --> శరణం అయ్యప్ప
ఓం రుద్రాంశ మూర్తియే --> శరణం అయ్యప్ప
ఓం పౌరుషశక్తి మ్తుర్తియే --> శరణం అయ్యప్ప
ఓం తారక బ్రహ్మ మూర్తియే --> శరణం అయ్యప్ప
ఓం జ్ఞాన సంపద మూర్తియే --> శరణం అయ్యప్ప
ఓం వన్పులి వాహననే --> శరణం అయ్యప్ప
ఓం వావర్ స్వామియే --> శరణం అయ్యప్ప
ఓం శబరి పీఠమే --> శరణం అయ్యప్ప
ఓం సచ్చిదానంద స్వరూపమే --> శరణం అయ్యప్ప
ఓం సకల కళా వల్లభనే --> శరణం అయ్యప్ప
ఓం కరిమల వాసననే --> శరణం అయ్యప్ప
ఓం కరిమల ఏ[టమే --> శరణం అయ్యప్ప
ఓం కరిమల ఏరక్కమే --> శరణం అయ్యప్ప
ఓం కలియుగ వరదనే --> శరణం అయ్యప్ప
ఒం కరుప్ప స్వామియే --> శరణం అయ్యప్ప
ఓం కాళిడం కుండ్రమే --> శరణం అయ్యప్ప
ఓం కానన వాసనే --> శరణం అయ్యప్ప
ఓం కుళ్తుత్తు పులై బాలికనే --> శరణం అయ్యప్ప
ఓం ఆర్యాంగా వయ్యనే --> శరణం అయ్యప్ప
ఓం ఆశ్రిత రాక్షకనే --> శరణం అయ్యప్ప
ఓం ఇష్ట ప్రదయకనే --> శరణం అయ్యప్ప
ఓం ఇంద్ర గర్వ భంగనే --> శరణం అయ్యప్ప
ఓం ఊర్ద్వ రేతనే --> శరణం అయ్యప్ప
ఓం ఎరిమేలి ధర్మ శాస్తావే --> శరణం అయ్యప్ప
ఓం ఎన్‌కుల దైవమే --> శరణం అయ్యప్ప
ఓం ఐందుమలై వాసనే --> శరణం అయ్యప్ప
ఓం ఛాయ రూపమే --> శరణం అయ్యప్ప
ఓం జగద్గురువే --> శరణం అయ్యప్ప
ఓం జగదానంద దాయకనే --> శరణం అయ్యప్ప
ఓం నాగరాజనే --> శరణం అయ్యప్ప
ఓం తంజం ఆలిప్పవనే --> శరణం అయ్యప్ప
ఓం నవ నీత శక్తినే --> శరణం అయ్యప్ప
ఓం నిత్య బ్రహ్మ చారియే --> శరణం అయ్యప్ప
ఓం నీలిమలై ఏటమే --> శరణం అయ్యప్ప
ఓం భక్తవత్సలనే --> శరణం అయ్యప్ప
ఓం శరణాగత వత్సలనే --> శరణం అయ్యప్ప
ఓం అలుదామేడే --> శరణం అయ్యప్ప
ఓం అనాధ నాదనే --> శరణం అయ్యప్ప
ఓం పరాక్రమ శాలియే --> శరణం అయ్యప్ప
ఓం పంబా స్నానమే --> శరణం అయ్యప్ప
ఓం పంబయిల్ విళక్కనే --> శరణం అయ్యప్ప
ఓం పాప సంహరనే --> శరణం అయ్యప్ప
ఓం పొన్నప్ప స్వామియే --> శరణం అయ్యప్ప
ఓం పొన్నంబల వాసనే --> శరణం అయ్యప్ప
ఓం పెరియాన పట్టమే --> శరణం అయ్యప్ప
ఓం బంధ విముక్తనే --> శరణం అయ్యప్ప
ఓం భూత నాధనే --> శరణం అయ్యప్ప
ఓం మనికంఠ దైవమే --> శరణం అయ్యప్ప
ఓం మదగజ వాహననే --> శరణం అయ్యప్ప
ఓం మహిషి మర్దననే --> శరణం అయ్యప్ప
ఓం మకర జ్యోతియే --> శరణం అయ్యప్ప
ఓం పరబ్రహ్మ జ్యోతియే --> శరణం అయ్యప్ప
ఓం కాంతమలై జ్యోతియే --> శరణం అయ్యప్ప
ఓం మాలికా రోత్తమ దేవి మంజు మాతాయే--> శరణం అయ్యప్ప
ఓం మొహన రూపనే --> శరణం అయ్యప్ప
ఓం శ్రీ పూర్ణ, పుష్కళ సమేత శ్రీ హరి హర సుతన్ ఆనంద చితన్ అయ్యాన్ అయ్యప్ప స్వామియ్ శరణం అయ్యప్ప
పూర్ణ, పుష్కళ అంటే ఆయన భార్యలు కాదు, ఆయనకు ఉన్న శక్తులు. ఆయన వద్ద రెండు గొప్ప శక్తులు ఉన్నాయని అర్థం. అవే పూర్ణత్వం .. పుష్కళత్వం.
పూర్ణత్వమంటే నిండుగా ఉండటం. ఎంతలా అంటే ఎంతమంది వచ్చినా ఇచ్చేంత పుష్కళంగా ఉండటం అని అర్థం. ఇలా ఎంతైనా ఇవ్వగలిగిన రెండు శక్తులు ఉన్న వాడే పూర్ణ, పుష్కళ సమేతుడు.
ఓం శ్రీ పూర్ణ, పుష్కళ సమేత శ్రీ హరి హర సుతన్ ఆనంద చితన్ అయ్యాన్ అయ్యప్ప స్వామియ్ శరణం అయ్యప్ప
అయ్యప్ప శాస్తాస్తుతి (ఆది శంకర ప్రణీతము)
లోక వీరం మహా పూజ్యం, సర్వ రక్షా కరం విభుం
పార్వతీ హృదయానందం, శాస్తారం ప్రణమామ్యహం
లోకనాయకుడు , గొప్ప గొప్పవాడు, అందరినీ రక్షించే ప్రభువు, మరియు పార్వతి హృదయానికి ఆనందాన్ని ఇచ్చే ఆ భగవంతుడు శాస్తాకు నమస్కరిస్తున్నాను. .
విప్ర పూజ్యం, విశ్వ వంధ్యం, విష్ణు శంభో ప్రియం సుతం
క్షిప ప్రసాద నిరతం, శాస్తారం ప్రణమామ్యహం
(బ్రాహ్మణులచే పూజింపబడుతున్న, విశ్వం చేత నమస్కరింపబడే, విష్ణువు మరియు శివుని ప్రియ పుత్రుడు, ఎవరైతే ఆ భగవంతుడైన శాస్తాకు నమస్కరిస్తున్నాను . చాలా త్వరగా సంతృప్తి చెందుతుంది.
మత్త మాతంగ గమనం, కారుణ్యామృత పూరీతం,
సర్వ విఘ్నహారం దేవం, శాస్తారం ప్రణమామ్యహం
బలమైన ఏనుగులా నడిచేవాడూ, కరుణామయమైన అమృతంతో నిండినవాడూ, అన్ని ఆటంకాలను తొలగించే దోవుడూ అయిన ఆ శాస్తా దేవునికి నమస్కరిస్తున్నాను .
అస్మత్ కులేశ్వరం దేవం, అస్మత్ శతు వినాశనం,
అస్మ దిష్ట ప్రదాతారం, శాస్తారం ప్రణమామ్యహం
నా వంశానికి దేవుడు, నా శత్రువులను నాశనం చేసేవాడు, నా కోరికలన్నింటినీ తీర్చేవాడు అయిన
శాస్తా దేవుడికి నమస్కరిస్తున్నాను .
పాండే వంశ తిలకం, కేరళ కేళి విగ్రహం,
ఆర్త త్రాణ పరం దేవం, శాస్తారం ప్రణమామ్యహం
పాండ్యుల వంశంలో గొప్పవాడు, కేరళలోని ఆటలాడు దేవుడు, అణగారిన వారిని ఆదుకునే దేవుడు ఆ శాస్తా దేవునికి నమస్కరిస్తున్నాను.
పంచ రత్నాఖ్య మేతద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః
తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే
అరుణోదయ సంకాశం నీలకుండల ధారణం
నీలాంబర ధరం దేవం వందేహం బ్రహ్మ నందనం !!
చాప బాణం వామస్తే చిన్ముద్రాం దక్షిణకరే
విలసత్ కుండల ధరం వందేహం విష్ణు నందనం !!
వ్యాఘ్రూరూఢం రక్తనేత్రం స్వర్ణమాలా విభూషణం
సువీరాట్టధరం దేవం వందేహం శంభు నందనం !!
కింగిణిదణ్యాను భూషణం పూర్ణచంద్ర నిబాననం
కిరాతరూప శాస్తారం వందేహం పాండ్య నందనం
భూత భేతాళ సం సేవ్యం కాంచనాద్రి నివాసితం
మణికంఠ మితిఖ్యాతం వందేహం శక్తి నందనం !!
భూతనాథ, సదానంద, సర్వ భూత దయా పర,
రక్షరక్ష మహా బహో శ్యాస్తే తుభం నమో నమ
సర్వప్రాణులకు ప్రభువు, నిత్యం సుఖంగా ఉండేవాడు, సర్వ ప్రాణుల పట్ల దయ చూపేవాడు,
ఆ శాస్త్రానికి నన్ను రక్షించమని ప్రార్థిస్తున్నాను.
10. అయ్యప్ప కర్పూర హారతి
శంకరాయ శంకరాయ శంకరాయ మంగళం,
శాంకరి మనోహరాయ శాశ్వతాయ మంగళం
గురువరాయ మంగళం - దత్తాత్రేయ మంగళం,
రాజరామ మంగళం - రామకృష్ణ మంగళం
అయ్యప్ప మంగళం - మణికంఠ మంగళం,
శబరీషా మంగళం - శాస్తయా మంగళం
మంగళం మంగళం నిత్యజయ మంగళం
మంగళం మంగళం నిత్యశుభ మంగళం
హరిహరులపుత్రుడైన అయ్యప్పకు మంగళం
రామ లక్ష్మణ జానకి జై భోలో హనుమాను కి
రామ లక్ష్మణ జానకి జై భోలో హనుమాను కి
జయ హనుమాన్ జయ హనుమాన్ ,
మారుతీ రాయ జయ హనుమాన్ ,
జయ మారుతీ రాయ జయ హనుమాన్.
"సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్తా సుఖినోభవంతు"
క్షమాపణ మంత్రం
స్వామి జ్ఞానంతో కానీ, అజ్ఞానంతో కానీ, తెలిసి కానీ, తెలియక కానీ, నేను /మేము చేసిన సకల తప్పులను మన్నించి కాపాడుము స్వామి
సత్యమగు అష్ఠాదశ సోపానాధిపతులపైన చిన్ముద్ర దారిగా అమరివుండి సమస్త భూమండలమును ఏక ఛత్రాధిపత్యం తో పరిపాలించుచుండెడి ఓం శ్రీ పూర్ణ, పుష్కళ సమేత శ్రీ హరి హర సుతన్ ఆనంద చితన్ అయ్యాన్ అయ్యప్ప స్వామి మీ పాదములే మాకు శరణం శరణం శరణం తండ్రి.
ఓం శ్రీ స్వామి యే శరణం అయ్యప్ప
ఓం శ్రీ స్వామి యే శరణం అయ్యప్ప
ఓం శ్రీ స్వామి యే శరణం అయ్యప్ప
చిన్ముద్ర అంటే బొటన వ్రేలిపై చూపుడు వ్రేలిని నిలిపి ఉంచడం. బొటన వ్రేలిని భగవంతుడిగానూ, చూపుడి వ్రేలిని జీవుడిగానూ భావించి కలిపి, మిగిలిన మూడు వ్రేళ్ళనూ అహంకార, భ్రమ, చెడు ప్రవృత్తులుగా భావించి దూరంగా పెట్టాలనేదే ఈ ముద్రం అర్థం.
ఆత్మ ప్రదక్షిణము మంత్రం
యానికాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి - ప్రదక్షి పదేపదే
పాపోహం పాపకర్మాహం- పాపాత్మా పాప సంభవంః
త్రాహిమాం కృపయా- శరణాగతి వత్సలం
అన్యథా శరణం నాస్తి- త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్యభావనే- రక్షరక్ష మణికంఠ
ఓం శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామినే నమః అనంత కొటి ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
సాష్టాంగ నమస్కారం మంత్రం
స + అష్ట + అంగ = సాష్టాంగ --> అనగా 8 అంగములతో నమస్కారం చేయడం.
సాష్టాంగ నమస్కారము అంటే మానవునికి వున్న ఎనిమిది అంగాలతో నమస్కారం చేయడం అని అర్ధము.
ఉరసా శిరసా దృష్ట్యా మనసా
వచసా తథా పద్భ్యాం కరాభ్యాం
కర్ణాభ్యామ్ ప్రణామో ష్టాంగ ఈరిత:
అష్టాంగాలు అంటే..
1) "ఉరసా" అంటే తొడలు,
2) "శిరసా" అంటే తల,
3) "దృష్ట్యా" అనగా కళ్ళు,
4) "మనసా" అనగా హృదయం,
5) "వచసా" అనగా నోరు,
6) "పద్భ్యాం" అనగా పాదములు,
7) "కరాభ్యాం" అనగా చేతులు,
8) "కర్ణాభ్యాం" అంటే చెవులు.అని అర్థం.
Note: ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజస్తంభానికి మధ్య లో కాకుండా ధ్వజస్తంభం వెనుక వుండి చేయాలి.
తీర్ధం ఇచ్చేటప్పుడు చెప్పే మంత్రం
అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం శ్రీ (దైవం పేరు) పాదోదకం పావనం శుభం
అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం శ్రీ అయ్యప్ప / పరమేశ్వర పాదోదకం పావనం శుభం.
స్వాములందరు ఏదైనా తప్పుగా అనిపిస్తే నన్ను మన్నించి, తప్పులను నాకు తెలియచేయండి.
ఏమైనా తప్పులు దొర్లినట్టు అయితే క్షమించమని ప్రార్థిస్తూ ....
మీ బోయిన నరేంద్ర ( స్మైలీ స్వామి )
S/o బోయిన ఉదయ భాస్కరరావు గారు
ఉరివి గ్రామం, పెడన మండలం, కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్.
9700422902