Friday, November 8, 2024

అయ్యప్ప స్వామి భజన పాటలు

అంబ పరమేశ్వరి పల్లకీ  పాట 

అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, ఆది పరాశక్తి పాలయమాం,

శ్రీ భువనేశ్వరి రాజ రాజేశ్వరి, ఆంనంద రూపిణి, పాలయమాం --

అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, ఆది పరాశక్తి పాలయమాం,

శ్రీ భువనేశ్వరి రాజ రాజేశ్వరి, ఆంనంద రూపిణి, పాలయమాం --

వీణాపాణి విమల స్వరూపిణి, వేదాంత రూపిణి పాలయమాం --  ||  అంబ పరమేశ్వరి  ||

కామిత దాయని కరుణాస్వరూపిణి,  కన్యా కుమారి పాలయమాం .. ||  అంబ పరమేశ్వరి  ||

మంజులభాషిణి మంగళదాయని,  మధురమీనాక్షి పాలయమాం .. ||  అంబ పరమేశ్వరి  ||

రాజస్వరూపిణి రాజరాజేశ్వరి ,  శ్రీచక్రవాసిని పాలయమాం  .. ||  అంబ పరమేశ్వరి  ||

అంబ జగదీశ్వరి అన్నపూర్ణేశ్వరి, ఆది పరాశక్తి పాలయమాం  .. ||  అంబ పరమేశ్వరి  ||

చాముండేశ్వరి శ్రీలలితేశ్వరి,  కారుణ్యరూపిణి పాలయమాం .. ||  అంబ పరమేశ్వరి  ||

కంచికామాక్షి మధురమీనాక్షి,  లావణ్య రూపిణి పాలయమాం .. ||  అంబ పరమేశ్వరి  ||

కాషాయంబరీ సుందరరూపిణి,  బిందుకళాధరి పాలయమాం .. ||  అంబ పరమేశ్వరి  ||

మధురసుభాషిణి మణిమయధారిణి, మంగళదాయిని పాలయమాం .. ||  అంబ పరమేశ్వరి  ||

శ్రీకాత్యాయిని జయజయ గౌరీ,  దేవి కృపాకరి పాలయమాం .. ||  అంబ పరమేశ్వరి  ||

అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి,  ఆది పరాశక్తి పాలయమాం,

శ్రీ భువనేశ్వరి రాజ రాజేశ్వరి, ఆంనంద రూపిణి, పాలయమాం --

అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, ఆది పరాశక్తి పాలయమాం,

శ్రీ భువనేశ్వరి రాజ రాజేశ్వరి, ఆంనంద రూపిణి, పాలయమాం --

పాలయమాం --అంబ...పాలయమాం --

పాలయమాం --అంబ...పాలయమాం --

పాలయమాం --అంబ...పాలయమాం -- 

జై  భోలో దుర్గ భవాని మాత కి  జై 

జై భోలో ఆది పరాశక్తి కి  జై 

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

 అయ్యప్ప  మల్లెపూల పల్లకీ  పాట  

మల్లెపూల పల్లకీ బంగారు పల్లకీ

మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి

మల్లెపూల పల్లకీ బంగారు పల్లకీ

మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి

మల్లెపూల పల్లకీ బంగారు పల్లకీ

మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి

మల్లెపూల పల్లకీ బంగారు పల్లకీ

మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి

విల్లాలి వీరుడు యెక్కినాడు పల్లకి

వీర మణికంఠుడు యెక్కినాడు పల్లకి

విల్లాలి వీరుడు యెక్కినాడు పల్లకి

వీర మణికంఠుడు యెక్కినాడు పల్లకి

హా... పందళ బాలుడు పంబ వాసుడు
హరిహర తనయుడు యెక్కినాడు పల్లకి

మల్లెపూల పల్లకీ బంగారు పల్లకీ
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి

గణపతి సోదరుడు యెక్కినాడు పల్లకి
షణ్ముఖ సోదరుడు యెక్కినాడు పల్లకి

గణపతి సోదరుడు యెక్కినాడు పల్లకి
షణ్ముఖ సోదరుడు యెక్కినాడు పల్లకి

హా... ఎరుమేలి వాసుడు ఏకాంత వాసుడు
హరిహర తనయుడు యెక్కినాడు పల్లకి

మల్లెపూల పల్లకీ బంగారు పల్లకీ
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి

మహిషి మర్ధనుడు యెక్కినాడు పల్లకి
మదగజ వాహనుడు యెక్కినాడు పల్లకి
మహిషి మర్ధనుడు యెక్కినాడు పల్లకి
మదగజ వాహనుడు యెక్కినాడు పల్లకి

హా... కరిమల వాసుడు నీలిమల వాసుడు
హరిహర తనయుడు యెక్కినాడు పల్లకి

మల్లెపూల పల్లకీ బంగారు పల్లకీ
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి

కాంతమల వాసుడు యెక్కినాడు పల్లకి
జ్యోతి స్వరూపుడు యెక్కినాడు పల్లకి

కాంతమల వాసుడు యెక్కినాడు పల్లకి
జ్యోతి స్వరూపుడు యెక్కినాడు పల్లకి

హా.. భక్తుల బ్రోచే బంగారు స్వామి
హరిహర తనయుడు యెక్కినాడు పల్లకి

మల్లెపూల పల్లకీ బంగారు పల్లకీ
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

                               రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి

రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి
(రావా అయ్యప్ప స్వామి… రవ్వల పందిళ్లలోకి) || 2 ||

రవ్వల పందిళ్లలోన ముత్యాల ముగ్గులేసి
(రవ్వల పందిళ్లలోన ముత్యాల ముగ్గులేసి)
ముత్యాల ముగ్గులోన రతనాల రాసిపోసి
(ముత్యాల ముగ్గులోన రతనాల రాసిపోసి)
రతనాల రాసిపైన పీటలే వేసినాము
(రతనాల రాసిపైన పీటలే వేసినాము)
రావా రావా రావా రావ రావ రావా

రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి
(రావా అయ్యప్ప స్వామి… రవ్వల పందిళ్లలోకి) || 2 ||

అరటిచెట్లు తెచ్చినాము… మండపాలు కట్టినాము
(అరటిచెట్లు తెచ్చినాము మండపాలు కట్టినాము)
మల్లెపూలు తేచినాము మాలలే కట్టినాము
(మల్లెపూలు తేచినాము మాలలే కట్టినాము)

కొబ్బరాకులు తేచినాము తోరణాలు కట్టినాము
కొబ్బరాకులు తేచినాము తోరణాలు కట్టినాము
రావా రావా రావా రావ రావ రావా
రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి
(రావా అయ్యప్ప స్వామి… రవ్వల పందిళ్లలోకి) || 2 ||

మేళతాళాల తోటి… భజనలే చేసినాము
(మేళతాళాల తోటి భజనలే చేసినాము)
ఆవునెయ్యి తోటి… మేము దీపాలు పెట్టినాము
(ఆవునెయ్యి తోటి మేము దీపాలే పెట్టినాము)

పంచామృతముల తోటి… అభిషేకం చేసినాము
పంచామృతముల తోటి… అభిషేకం చేసినాము
రావా రావా రావా రావ రావ రావా
రావా అయ్యప్ప స్వామి… రవ్వల పందిళ్లలోకి
(రావా అయ్యప్ప స్వామి… రవ్వల పందిళ్లలోకి) || 2 ||

మంత్రతంత్రాల తోటి పూజలే చేస్తాము
(మంత్రతంత్రాల తోటి పూజలే చేస్తాము)
పాలు పండ్లు తేచినాము నైవేద్యం పెట్టినాము
(పాలు పండ్లు తేచినాము నైవేద్యం పెట్టినాము)

కర్పూరం వెలిగించి హారతులే ఇష్టము
(కర్పూరం వెలిగించి హారతులే ఇష్టము)
రావా రావా రావా రావ రావ రావా
రావా అయ్యప్ప స్వామి… రవ్వల పందిళ్లలోకి
(రావా అయ్యప్ప స్వామి… రవ్వల పందిళ్లలోకి) || 2 ||

రవ్వల పందిళ్లలోన… ముత్యాల ముగ్గులేసి
(రవ్వల పందిళ్లలోన… ముత్యాల ముగ్గులేసి)
ముత్యాల ముగ్గులోన రతనాల రాశిపోసి
(ముత్యాల ముగ్గులోన రతనాల రాశిపోసి)

రతనాల రాశిపైన పీటలే వేసినాము
(రతనాల రాశిపైన పీటలే వేసినాము)
రావా రావా రావా రావ రావ రావా
రావా అయ్యప్ప స్వామి… రవ్వల పందిళ్లలోకి
(రావా అయ్యప్ప స్వామి… రవ్వల పందిళ్లలోకి) || 3 |||
ఓం స్వామీయే… శరణమయ్యప్ప

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

శబరిమల అయ్యా నీకు పులివాహనం
పళనిమల అయ్యా నీకు నెమలి వాహనం

శబరిమల అయ్యా నీకు పులివాహనం
పళనిమల అయ్యా నీకు నెమలి వాహనం

హరి హరోం హర - హర హరోం హర....
హరి హరోం హర -  హర హరోం హర...

స్వామి దింతకథోం- అయ్యప్ప దింతకథోం
స్వామి దింతకథోం - అయ్యప్ప దింతకథోం

శబరిమల అయ్యా నీకు ఇరుముడి పూజ
పళనిమల అయ్యా నీకు కావడి పూజ

శబరిమల అయ్యా నీకు ఇరుముడి పూజ
పళనిమల అయ్యా నీకు కావడి పూజ

శబరిమల అయ్యా నీకు నెయ్యాభిషేకం
పళనిమల అయ్యా నీకు పాలాభిషేకం
శబరిమల అయ్యా నీకు నెయ్యాభిషేకం
పళనిమల అయ్యా నీకు పాలాభిషేకం

శబరిమల అయ్యా నీకు బాణాయుధం
పళనిమల అయ్యా నీకు వేలాయుధం
శబరిమల అయ్యా నీకు బాణాయుధం
పళనిమల అయ్యా నీకు వేలాయుధం

శబరిమల అయ్యా నీకు అయిదు కొండలు...
పళనిమల అయ్య నీకు ఆరు కొండలు
శబరిమల అయ్యా నీకు అయిదు కొండలు
పళనిమల అయ్య నీకు ఆరు కొండలు

హరి హరోం హర - హర హరోం హర...
హరి హరోం హర -  హర హరోం హర ...

స్వామి దింతకథోం- అయ్యప్ప దింతకథోం
స్వామి దింతకథోం - అయ్యప్ప దింతకథోం

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

No comments:

Post a Comment