Saturday, November 9, 2024

అయ్యప్ప దీక్షలో పాటించాల్సిన నియమాలు

                            శ్రీరస్తు                            శుభమస్తు                            అవిఘ్నమస్తు


Note: ఇంకా పూర్తి కాలేదు 


శివునికి ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో కఠిన నియమ, నిష్టలతో శక్తిరూపుడైన అయ్యప్ప దీక్షలు చేపట్టడం జన్మజన్మల పుణ్యఫలం:


జన్మజన్మల పుణ్యఫలం ప్రసాదించే అయ్యప్ప దీక్షలో  41 రోజుల నియమాలు  పాటించాల్సి ఉంటుంది

నాకు తెలిసి నేను అనుసరించే  కొన్ని ముఖ్యమైన  నియమాలు తెలియచేస్తాను,  దయ చేసి ఈ నియమాలు పాటిస్తూ మీ దీక్షను మంగళకరంగా పూర్తి చెయ్యండి. 

నియమాలు పాటించలేము అనే వాళ్ళు దయ చేసి మాల ధారణ చెయ్యవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాను. మాల ధారణ లేకుండా కూడా పూజలు చేసుకోవచ్చు)

తల్లి తండ్రుల అనుమతి, భార్య యొక్క అనుమతి,గురుస్వామి అనుమతి తీసుకుని మాల ధరించాలి.

మీరు దీక్ష తీసుకుంటే మీ ఇంటిల్లీపాది మీ దీక్ష అయ్యేవరకు  మీ ఇంట్లో వారు కూడా మద్యం, ధూమపానం, మాంసాహారం కి దూరంగా ఉండాలి. మీరు బయట సన్నిధానంలో ఉన్న, మీ తల్లి తండ్రులు, భార్యబిడ్డలకి కూడా ఇది వర్తిస్తుంది.

18 సార్లు మాల ధరించారు అంటే గురు స్వామి కి చాల విషయాలు తెలిసి ఉంటాయి, గురు స్వామి గారి దగ్గర మాల ధారణ లో పాటించ వలసిన నియమాలు నిబంధనలు అన్ని అడిగి తెలుసుకోవాలి. 


గురు బ్రహ్మ -  సృష్టికర్త అని కూడా పిలుస్తారు, 

గురు విష్ణువు - విష్ణువు నిర్వాహకుడు అని పిలువబడే భగవంతుడు

గురు దేవో మహేశ్వరః - గురువు మహేశ్వరుడు (శివుడు లేదా నాశనం చేసేవాడు) 

గురు సాక్షాత్ పరబ్రహ్మ-  సర్వశక్తిమంతుడు.

అందువలన గురువుని దూషించడం, అగౌరవ పరచడం చెయ్యకూడదు. 

గురు స్వామి  మీద నమ్మకం తో వారిని గౌరవిస్తూ, గురు స్వామి చెప్పినట్లు చేస్తూ మాల ధారణ ను శుభదాయకంగా పూర్తి చేసుకోవాలి.

మాల ధారణ అంటే మనలో మంచి మార్పు కోసం మనం పాటించే నియమాలు, కొన్ని సాంప్రదాయ పద్ధతులు , కొన్ని  శాస్త్రాల్లో ఉన్న విషయాలు తెలుసుకుని ఆచరించడం.  

ఏ స్వామి చెప్పిన సరే మన మంచి కే చెప్తారు, కొంచెం కఠినం గా ఉన్నాసరే ముందు తెలుసుకుని పాటించండి. 

పూజ కి ముందు గా చేయవలసినవి & చేయకూడనివి:

శరీర పరిశుద్ధి : 

  • స్వాములంతా నిత్యం బ్రహ్మముహూర్తంలో ఉదయం 3:30-4:00 గంటలకు (బ్రహ్మ గడియా) నిద్రలేచి, మీ మాలకి నమస్కరించుకుని, చన్నీటి స్నానమాచరించి, సన్నిధానం /పీఠం ఉన్న గది ని శుభ్రంగా తడిబట్ల తో శుభ్రపర్పుకోవాలి. (చీపురు వాడరాదు).
  • సూర్యోదయం కాకముందే పూజనుముగించాలి. తిరిగి సాయంత్రం చన్నీటి స్నానం చేసి సంధ్యాపూజ చేయాలి.  (అయ్యప్ప పీఠం దగ్గర పూజ విధానం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి )
  • మలవిసర్జనకు వెళ్తే కచ్చిత్తంగా స్నానమాచరించి, నుదిటి మీద గంధం(చందనం), కుంకుమ, విభూది పెట్టుకుని స్వామివారి శరణుఘోష చెప్పి హారతి తీసుకోవాలి.
  • మూత్రవిసర్తన చేసినట్లు అయితే కాళ్ళని, చేతులను, జ్ఞానేద్రియాలను శుభ్రముగా కడుక్కోవాలి 

అలంకరణ :  

  • స్థానం చేసిన వెంటనే మెడ లో ఉన్న మాలకి గంధం (చందనం), కుంకుమ తో అలంకారం చేసి, తర్వాత  నుదిటి  (ముఖము) మీద గంధం ( హరి), విభూది(హర), కుంకుమ(అమ్మవారు) లతో అలంకరించుకోవాలి. (మనం నుదిటి మీద బొట్టు లేకుండా ఎవ్వరికి కనిపించకూడదు)
  • స్వామివారికి నలుపు తప్ప మరే ఇతర రంగుల వస్త్రాలు ధరించకూడదు (గురు స్వాములు కూడా నల్ల బట్టలు ధరించాలి 
  • వివరణ: అయ్యప్ప శనీశ్వరుని తో ఇలా మాట ఇచ్చాడు "ఎవరైనా మండల కాలం  అయ్యప్ప దీక్షను తీసుకుంటారో వారిని ఇబ్బంది పెట్టవద్దు. శనీశ్వరుని కి ఇష్టమైన రంగు నలుపు కాబట్టి  దీక్ష సమయం మొత్తం పాదరక్షలు విడిచి, నలుపు రంగు దుస్తులు ధరిస్తారు అని మాట ఇచ్చాడు.

భిక్ష + అల్పాహార 

  • ఎవరై బిక్ష (భోజనం లేదా టిఫిన్) కోసం మనల్ని పిలిస్తే, హాజరు కావడానికి ప్రయత్నించాలి,  వద్దు అని చెప్పకూడదు, కుల మరియు మతాలకు అతీతంగా, వారు ఉంచే ఆహారం గురించి వ్యాఖ్యానించకూడదు. (అన్నం పొందడం మహాభాగ్యం, అదృష్టవంతులకే స్వామివారి ప్రసాదం లభిస్తుంది)
  • మధ్యాహ్నం సూర్యుడు నెత్తిమీదికి వచ్చే లోపు అనగా (2:30PM) గంటలలోపు భిక్ష చేయాలి. సాయంత్రం పూజ అనంతరం కొద్ది మొత్తంలో అల్పాహారాన్ని స్వీకరించాలి. 
  • భిక్ష + అల్పాహార చేసేటప్పుడు ఈ క్రింద ఉన్న నియమాలను పాటించాలి 
    • తినే ముందు షర్ట్ తీసెయ్యాలి 
    • హిందూ సంప్రదాయం ప్రకారం కండువాను నడుముకి తాడులా చేసి కట్టుకోకూడదు (తల్లి తండ్రులు లేకపోతే  తాడులా కట్టుకోవచ్చు) స్వాములందరూ  కండువాను నడుముకి పంచె చుట్టుకున్నట్లు చుట్టుకోవడం ఉత్తమం.
    • వండిన పదార్ధాలు అన్ని విస్తార(ఆకు) లో వడ్డించిన తరువాతనే ఆచమనం చేసుకుని తినాలి.
    • స్వామి ధర్మ స్వరూపుడు మరియు ఆయన పూర్ణత్వం (పూర్ణం) మరియు పుష్కలత్వం (పుష్కలం) లకు అధికారం, కాబట్టి స్వామి దీక్ష తీసుకునే వ్యక్తి సమృద్ధి మరియు సంపూర్ణతతో ఆశీర్వదించబడతాడు. ఎవరైనా అనుగ్రహించవలసి వస్తే, ఎల్లప్పుడూ స్వామివారి ప్రసాదాన్ని తీసుకోవాలి
  • స్వాములు మాల ధారణ పూర్తి అయ్యే లోపు  ఐదుగురు అయ్యప్పల ను పిలిచి భిక్ష పెట్టాలి.
  • స్వాము లకు బిక్షను స్థానం చేసి ఎవరైనా శుభ్రం గా తయారు చేసి పెట్టవచ్చు.
  • స్వాములు బయట తిను బండారాలు తినకూడదు  
  • ఏదైనా భజనకు / భిక్షకు వెళ్ళినప్పుడు ముందుగా తినడానికి కూర్చోకుండా ఏదైనా సహాయం / సేవ చేయటానికి ప్రయత్నం చేయాలి. 
  • ఎవరైనా స్వాములు కానీ, సివిల్‌ స్వాములుగాని భిక్షకు పిలిచినప్పుడు వస్తాం అని చెప్పి వెళ్లకుండా ఉండరాదు. వస్తాం అని చెపితే కచ్చితంగా వెళ్ళాలి. బిక్ష సమయానికి కాకుండా కొంచెం ముందుగా వెళ్లి ఏదొనా సహాయం / సేవ కానీ చేయాలి.
  • ఉల్లిపాయ, వెల్లుల్లి, ములగకాయ, ముల్లంగి , గొంగుర వంటివి తినడం వలన శరీరం దీక్షకు సహకరించదు అని గమనించండి, పైన తెలిపినవి స్వాములకు వడ్డించవద్దు. స్వాములకు తినకూడని. 
  • ముఖ్య గమనిక: అన్నం పరబ్రహ్మ స్వరూపం (సృష్టికి, స్థితికి, శక్తికి మూలం అని భావిస్తారు). అందుకే ఆహారాన్ని పవిత్రంగా భావించి స్వాములు విస్తార లో వడ్డించిన పదార్థాలు అన్ని మెతుకు వదల కుండా తినాలి, తిన్న విస్తార శుభ్రం గా ఉండాలి అప్పుడే మనం అన్నం కి గౌరవం ఇచ్చినట్లు.  
  • చాలా మంది స్వాములు ఎక్కువ పెట్టించు కుని విస్తార లో వదిలేస్తున్నారు దానివల్ల చివరిలో తినాల్సిన స్వాములకు ఆహారం సరిపోవడం లేదు, అప్పుడు భిక్ష పెట్టుకున్న దాత కూడా అయ్యో స్వాములకి భిక్ష సరిపోలేదు అని బాధపడుతున్నారు ( నేను ప్రత్యక్షం గా చూసాను బిక్ష దాతలు బాధపడటం చూశాను, దయ చేసి కావాల్సినంత మాత్రమే పెట్టించుకుని తినండి) 
  • అయ్యప్పలకు వడ్డించే స్వాములకు చిన్న విన్నపం: స్వాములకు సంపూర్ణం గా పెట్టండి తప్పు లేదు... కానీ బలవంతం గా ఎక్కువ పెట్టవద్దు ( మాల లో ఉన్నప్పుడు అమితహారం తొలి నియమం) వడ్డించే వారు అతిగా వడ్డించడం వలన స్వాములు ఎక్కువ తినేసి అరగక వాంతులు చేసుకుంటున్నారు కొంచెం అర్థం చేసుకోండి. స్వాములు మీరు కూడా సున్నితంగా తిరస్కరించాలి అంతే కానీ ఎక్కువ పెట్టించుకుని వదిలేయడం, ఎక్కువ తిని వాంతులు చేసుకుని ఆరోగ్యం పాడు చేసుకోవడం మంచిది కాదు. 
  • భిక్ష / అల్పహారం చేసిన తరువాత ఎవ్వరి పాదాలకు నమస్కారం చెయ్య కూడదు

నిద్ర

  • స్వాములు నేల మీద / చాప పైనే  నిద్రించాలి. పరుపులు, దిండ్లు వాడకూడదు. మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధి తో బ్రహ్మచారిత్వం  పాటించాలి 
  • మనల్ని ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం మరియు అహంకారాన్ని జయించడంలో అత్యున్నతమైన వాస్తవాన్ని (తత్ త్వమ్ అసి) గ్రహించడమే దీక్ష. 
  • దీనిని సాధించడానికి, సాత్త్విక మార్గాన్ని అనుసరించాలి, మధ్యాహ్నం తామసిక మార్గం వంటి ఇతర సమయాల్లో నిద్రించడం మరియు స్వామి యొక్క శరీర కూర్పు మరియు దినచర్యకు భంగం కలిగిస్తుంది.
  • ఉదయం పూట పడుకున్నట్లయితే...బిక్ష చేసే ముందు స్తానం చేసి అలంకరణ చేసుకుని మాల కి హారతి ఇచ్చి అప్పుడు బిక్ష చెయ్యాలి.
  • నిద్రించేటప్పుడు / స్వాములకు ఎవరికైనా పాద నమస్కారం చేసేటప్పుడు / సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు మన మెడ లో ఉన్న మాల నేలకు తాకకుండా జాగ్రత్త పడాలి.

పూజ : 
పూజ లో తడి వస్త్రాల (బట్టల) తో కూర్చోకూడదు.
వంటి మీద అంగ వస్త్రం లేకుండా & ఏక వస్త్రం తో కూర్చోకూడదు. 


సన్నిధానం / పీఠం పెట్టుకున్న వారు రోజు కచ్చితంగా రెండు పూటల దీపం పెట్టవలయును. 
ఉదయం, సాయంత్రం అటుకులు,  బెల్లం  నైవేద్యం గా పెట్టాలి. 

శబరి యాత్ర పూర్తయి తిరిగి వచ్చేవరకు ప్రతి రోజు రెండు పూటలా పీఠం దగ్గర దీపం వెలిగించాలి (లేదా) అఖండ జ్యోతి వెలుగుతూ ఉండాలి. 

స్వాములు ప్రతి రోజు ఏదైనా దగ్గర లో ఉన్న వివిధ దేవాలయ దర్శనం కి వెళ్ళాలి.

వీలుఅయినంత వరకు పీఠం పెట్టుకోవడానికే  ప్రయత్నించండి ( లేదా) పీఠం కోసం ఎవరితో అయిన కలిసి సన్నిధానం ఏర్పాటు చేసుకోండి

దీక్షా సమయంలో హోదా, వయస్సు, పేద, ధనిక తేడా లేకుండా అయ్యప్పలందరికీ పాదాభివందనం చేయాలి. 

సామాజిక సమానత్వం:

కుల మతాలను మించి అందరితో సోదర భావం కలిగి ఉండాలి.

ఉదయం, సాయంత్రం సన్నిధానం లో గురుస్వామికి, ఇతర స్వాములకు పాద నమస్కారం మోకాలు పైన కూర్చుని చేయాలి. వంగి నమస్కారాలు చేయరాదు.  ఆరోగ్య సమస్యలు ఉన్న వారు తగిన విధంగా చేయండి.


దీక్షను 41/48  (మండల కాలం) రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం తీసుకోవాలి కానీ 41/48 రోజుల కంటే తక్కువ కాదు.

స్వామి స్వచ్ఛమైన మనస్సు కలిగి ఉంటే, అహంకారము నశిస్తుంది మరియు ఎక్కడ అహంకారము నశించునో, అక్కడ దైవత్వం ప్రతిబింబిస్తుంది.మన భావాలను అదుపులో ఉంచుకోవాలి.


స్వాములు కచ్చితం గా చెయ్యకూడని పనులు 
  • తల్లిదండ్రులు మినహా దీక్షలోలేనివారికి పాదాభివందనం చేయకూడదు.
  • తల కి / జుట్టుకు నూనె రాసుకోకూడదు
  • తోలు (లెదర్ ) తో చేసిన వాచ్  లు,  బెల్ట్ లు పెట్టుకోకూడదు. 
  • మెడలో ఉన్న మాల కి కర్పూర హారతి తో మాత్రమే హారతి ఇవ్వాలి. కొంత మంది తెలియక  గుడికి వెళ్ళినప్పుడు అక్కడ వెలుగుతూ ఉండే  నూనె దీపాల తో మాల కి హారతి ఇస్తున్నారు అలా చెయ్యకండి.
  • మాల విరమణ చేసే వరకు బూతులు తిట్టడం, గొడవలు పడటం, అతిగా కోపగించుకోవడం చెయ్యకూడదు.
  • శబరిమలలో అయ్యప్పస్వామి దర్శనానంతరం దీక్షాపరులు ఇంటికి తిరిగి వచ్చాకే మాల విరమణ చేయాలి. ఇంటివద్ద మాతృమూర్తితో/ లేదా గురుస్వామి తో మాల తీయిం చాలి. దానిని (తీసిన మాల ను)  మరుసటి ఏడాది కోసం పసుపు గుడ్డ లో కట్టి  భద్రపర్చాలి. 
  • చెట్ల మీద నదులలో వెయ్యరాదు , ఆ మాల ని ఎవరైనా  తొక్కితే ఆ పాపం కూడా మనదే..!
  • ఇంకొక విషయం మనం మాలధారణ లో ఉన్నప్పుడు మాల కు ఎన్నో (సుమారుగా 100 పైగా) హారతులు ఇస్తాము అందువల్ల  మాలను పారవెయ్యకూడదు. ఒక పసుపు గుడ్డలో చుట్టి దేవుడి దగ్గర కానీ ఏదైనా సురక్షిత ప్రదేశం లో ఉంచండి. ఇంట్లో ఉంటే చెడు ఏమి జరగదు, పైగా అది రక్ష గా ఉంటుంది.

పదునెట్టాంబడి ప్రశస్త్తి: పదునెట్టాంబడి అంటే 18 మెట్లు అని అర్థం.  ఈ మెట్లలో ఎంతో మహత్యం ఉంది. 
కామం, క్రోధం, లోభం, మదం, మాత్సర్యం, మోహం, దర్పం, అహంకారం, వీక్షణాశక్తి, వినికిడి శక్తి, అగ్రాణశక్తి, రుచి చూసే శక్తి, స్పర్శశక్తి, సత్వగుణాలు, తమోగుణం, రజోగుణం, విద్య, అవిద్య. ఇలా అష్టాదశ శక్తులు అయ్యప్ప ఆలయం ముందు మెట్లపై నిక్షిప్తమై ఉన్నాయని ఆర్యులు పవిత్ర గ్రంథాల్లో పొందుపరిచారు. 

ఆ మెట్లలో 18 రకాల శక్తులుండటం వల్ల 18 సార్లు యాత్ర చేసి వస్తే తమ జన్మ సార్థకమని భక్తుల ప్రగాఢ విశ్వాసం.


అందువలన ఈ 18 మెట్లు ఎక్కాలంటే కచ్చితం గా  41/48 రోజుల దీక్ష చేసి ఇరుముడి కట్టుకుని మాత్రమే ఎక్కాలి.
 1 రోజు మాల, 3 రోజుల మాల, 11 రోజుల మాల, 21 మాల వేసుకుని 18 శక్తుల మీద కాలు పెట్టకూడదు (గురు స్వాములకు విన్నపం : దయచేసి ఇటువంటి మాల లు వెయ్యకండి/ ఇటువంటి వారికి ఇరుముడి కట్టకండి)

వీటిని పాటించడం ద్వారా భక్తులు "శరీరం మరియు మనసును" పరిశుద్ధం చేసుకుని భక్తి మార్గంలో ముందుకు సాగుతారు. 


గురు స్వాములు, స్వాములు,  ఏమైనా తప్పులు దొర్లినట్టు అనిపిస్తే క్షమించమని ప్రార్థిస్తూ మీ బోయిన నరేంద్ర ( స్మైలీ స్వామి )



No comments:

Post a Comment