శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
శివునికి ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో కఠిన నియమ, నిష్టలతో శక్తిరూపుడైన అయ్యప్ప దీక్షలు చేపట్టడం జన్మజన్మల పుణ్యఫలం:
జన్మజన్మల పుణ్యఫలం ప్రసాదించే అయ్యప్ప దీక్షలో 41 రోజుల నియమాలు పాటించాల్సి ఉంటుంది
నాకు తెలిసి నేను అనుసరించే కొన్ని ముఖ్యమైన నియమాలు తెలియచేస్తాను, దయ చేసి ఈ నియమాలు పాటిస్తూ మీ దీక్షను మంగళకరంగా పూర్తి చెయ్యండి. (నియమాలు పాటించలేము అనే వాళ్ళు దయ చేసి మాల ధారణ చెయ్యవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాను. మాల ధారణ లేకుండా కూడా పూజలు చేసుకోవచ్చు)
పూజ కి ముందు గా చేయవలసినవి & చేయకూడనివి:
శరీర పరిశుద్ధి :
- స్వాములంతా నిత్యం బ్రహ్మముహూర్తంలో ఉదయం 3:30-4:00 గంటలకు (బ్రహ్మ గడియా) నిద్రలేచి, మీ మాలకి నమస్కరించుకుని, చన్నీటి స్నానమాచరించి, సన్నిధానం /పీఠం ఉన్న గది ని శుభ్రంగా తడిబట్ల తో శుభ్రపర్పుకోవాలి. (చీపురు వాడరాదు).
సూర్యోదయం కాకముందే పూజనుముగించాలి. తిరిగి సాయంత్రం చన్నీటి స్నానం చేసి సంధ్యాపూజ చేయాలి. (అయ్యప్ప పీఠం దగ్గర పూజ విధానం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి ) - మలవిసర్జనకు వెళ్తే కచ్చిత్తంగా స్నానమాచరించి, నుదిటి మీద గంధం(చందనం), కుంకుమ, విభూది పెట్టుకుని స్వామివారి శరణుఘోష చెప్పి హారతి తీసుకోవాలి.
- మూత్రవిసర్తన చేసినట్లు అయితే కాళ్ళని, చేతులను, జ్ఞానేద్రియాలను శుభ్రముగా కడుక్కోవాలి
- స్థానం చేసిన వెంటనే మెడ లో ఉన్న మాలకి గంధం (చందనం), కుంకుమ తో అలంకారం చేసి, తర్వాత నుదిటి (ముఖము) మీద గంధం ( హరి), విభూది(హర), కుంకుమ(అమ్మవారు) లతో అలంకరించుకోవాలి. (మనం నుదిటి మీద బొట్టు లేకుండా ఎవ్వరికి కనిపించకూడదు)
- స్వామివారికి నలుపు తప్ప మరే ఇతర రంగుల వస్త్రాలు ధరించకూడదు (గురు స్వాములు కూడా నల్ల బట్టలు ధరించాలి, అయ్యప్ప శనీశ్వరునికి , "ఎవరైనా నా (అయ్యప్ప) దీక్షను తీసుకుంటారో వారిని ఇబ్బంది పెట్టవద్దు. మీకు ఇష్టమైన రంగు నలుపు కాబట్టి దీక్ష సమయం మొత్తం పాదరక్షలు విడిచి, నలుపు రంగు దుస్తులు మాత్రమే ధరిస్తారు ani తన మాటలను ఇచ్చాడు
ఆచమనము : కుడి అరచేతిని ఆవు చెవి ఆకారంలో ఉంచి, ఇందులో మూడు ఉద్ధరణిల నీటిని పోసుకొని “కేశవాయ స్వాహా", “నారాయణాయ స్వాహా", "మాధవాయ స్వాహా" అంటూ నోటితో స్వీకరించాలి .
ఆచమనము ఎందుకు చెయ్యాలి? : “కేశవాయ స్వాహా" అన్నప్పుడు అది గొంతునుండి వెలువడుతుంది. “నారాయణాయ స్వాహా" అనే మంత్రం నాలుక సాయంతో బయటకు వస్తుంది. చివరిగా "మాధవాయ స్వాహా" అనే మంత్రం పెదవుల సాయంతో వెలువడుతుంది. ఆచమనం అనే ఆచారాన్ని పాటించి ఈ మంత్రాలను ఉచ్చరించడం వల్ల గొంతు, నాలుక, పెదాలకు వ్యాయామం లభిస్తుంది. పైగా ఇవి పరమాత్ముని నామాలు కనుక, భక్తిభావంతో ఉచ్చరించడం వల్ల మేలు జరుగుతుంది.
భిక్ష + అల్పాహారం :
- ఎవరైన బిక్ష (భోజనం లేదా టిఫిన్) కోసం మనల్ని పిలిస్తే, హాజరు కావడానికి ప్రయత్నించాలి, వద్దు అని చెప్పకూడదు, కుల మరియు మతాలకు అతీతంగా, వారు ఉంచే ఆహారం గురించి వ్యాఖ్యానించకూడదు. (అన్నం పొందడం మహాభాగ్యం, అదృష్టవంతులకే స్వామివారి ప్రసాదం లభిస్తుంది)
- మధ్యాహ్నం సూర్యుడు నెత్తిమీదికి వచ్చే లోపు అనగా (2:30PM) గంటలలోపు భిక్ష చేయాలి. సాయంత్రం పూజ అనంతరం కొద్ది మొత్తంలో అల్పాహారాన్ని స్వీకరించాలి.
- భిక్ష + అల్పాహారం చేసేటప్పుడు ఈ క్రింద ఉన్న నియమాలను పాటించాలి
- తినే ముందు షర్ట్ తీసెయ్యాలి
- హిందూ సంప్రదాయం ప్రకారం కండువాను నడుముకి తాడులా చేసి కట్టుకోకూడదు (తల్లి తండ్రులు లేకపోతే తాడులా కట్టుకోవచ్చు) స్వాములందరూ కండువాను నడుముకి పంచె చుట్టుకున్నట్లు చుట్టుకోవడం ఉత్తమం.
- వండిన పదార్ధాలు అన్నివిస్తార(ఆకు) లో వడ్డించిన తరువాతనే ఆచమనం చేసుకుని తినాలి.
- స్వామి ధర్మ స్వరూపుడు మరియు ఆయన పూర్ణత్వం (పూర్ణం) మరియు పుష్కలత్వం (పుష్కలం) లకు అధికారం, కాబట్టి స్వామి దీక్ష తీసుకునే వ్యక్తి సమృద్ధి మరియు సంపూర్ణతతో ఆశీర్వదించబడతాడు. ఎవరైనా అనుగ్రహించవలసి వస్తే, ఎల్లప్పుడూ స్వామివారి ప్రసాదాన్ని తీసుకోవాలి
- తన శక్తికొలది ఒక్కసారైనా ఐదుగురు అయ్యప్పలకు భిక్ష పెట్టాలి.
నిద్ర :
- స్వాములు మధ్యాహ్నం పడుకోకూడదు.
- మనల్ని ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం మరియు అహంకారాన్ని జయించడంలో అత్యున్నతమైన వాస్తవాన్ని (తత్ త్వమ్ అసి) గ్రహించడమే దీక్ష.
- దీనిని సాధించడానికి, సాత్త్విక మార్గాన్ని అనుసరించాలి, మధ్యాహ్నం తామసిక మార్గం వంటి ఇతర సమయాల్లో నిద్రించడం మరియు స్వామి యొక్క శరీర కూర్పు మరియు దినచర్యకు భంగం కలిగిస్తుంది.
- ఉదయం పూట పడుకున్నట్లయితే...బిక్ష చేసే ముందు స్తానం చేసి అలంకరణ చేసుకుని మాల కి హారతి ఇచ్చి అప్పుడు బిక్ష చెయ్యాలి.
- జుట్టుకు నూనె రాసుకోకూడదు
- తల్లిదండ్రులు మినహా దీక్షలోలేనివారికి పాదాభివందనం చేయకూడదు.
- శబరిమలలో అయ్యప్పస్వామి దర్శనానంతరం దీక్షాపరులు ఇంటికి తిరిగి వచ్చాకే మాల విరమణ చేయాలి. ఇంటివద్ద మాతృమూర్తితో/లేదా గురుస్వామి తో మాల తీయిం చాలి. దానిని మరుసటి ఏడాది కోసం భద్రపర్చాలి. ()
ఆ మెట్లలో 18 రకాల శక్తులుండటం వల్ల 18 సార్లు యాత్ర చేసి వస్తే తమ జన్మ సార్థకమని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
వీటిని పాటించడం ద్వారా భక్తులు శరీరం మరియు మనసును పరిశుద్ధం చేసుకుని భక్తి మార్గంలో ముందుకు సాగుతారు.